నాగార్జునతో ప్లాన్ చేస్తున్నాడట.. మరో రూమర్ ?

నాగార్జునతో ప్లాన్ చేస్తున్నాడట.. మరో రూమర్ ?

Published on May 27, 2022 2:59 AM IST

డైరెక్టర్ సంపత్ నంది నాగార్జునతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జునకి సంపత్ నంది ఓ కథ చెప్పాడని, నాగార్జున గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాత నిరంజన్ రెడ్డి , నాగార్జున హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

డైరెక్టర్ ‘సంపత్ నంది’ను నాగార్జున దగ్గరకు పంపింది నిరంజన్ రెడ్డినే అని టాక్ నడుస్తోంది. మరి నాగార్జున ఇమేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య సంపత్ నంది రవితేజతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, నాగార్జున అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది ఫీల్ అవుతున్నాడట. ఏది ఏమైనా ‘సంపత్ నంది’ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు