చైతూ, శోభితాల నిశ్చితార్థం.. నాగ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

గతకొంత కాలంగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే ఈ జంట ఒకటి కానుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తూ వచ్చాయి. నేడు ఈ వార్తలను నిజం చేస్తూ, ఈ స్టార్ జంట నిశ్చితార్థం చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన మాజీ భార్య సమంతతో విడాకుల తరువాత చైతూ, శోభితా ధూళిపాలతో ప్రేమలో పడ్డాడు.

గురువారం రోజు వీరిద్దరు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఉదయం 9.42 గంటలకు ఈ జంట నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని అక్కినేని నాగార్జున తాజాగా కన్ఫర్మ్ చేశారు. శోభితాను తమ కుటుంబంలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ జంట కలకాలం ప్రేమతో సంతోషంగా కలిసి ఉండాలని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇక చైతూ-శోభితా నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version