నాగార్జున వీడియో లీక్.. నెట్టింట వైరల్!

సోషల్ మీడియాలో ఏదైనా వీడియో ప్రత్యక్షమైతే, నెటిజన్లు తెగ షేర్ చేస్తుంటారు. ఇలాగే, ఇప్పుడు ఓ భారీ సినిమాకు సంబంధించిన ఓ లీక్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ఓ సీన్‌కి సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ‘కూలీ’ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నుంచి ఇలా వీడియోలు లీక్ కావడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఎవరూ ఇలాంటి వీడియోలను రికార్డ్ చేయవద్దంటూ మేకర్స్ ఆర్డర్ వేశారు. అయితే, ఈ లీక్ వీడియోని చూసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని వారు అంటున్నారు.

Exit mobile version