నాగార్జునతో టాలెంటెడ్ డైరెక్టర్ యాక్షన్ డ్రామా !

Published on Sep 20, 2020 3:00 am IST


హిట్ లేక హీరోగా కథ ముగిసింది అనుకున్న హీరో రాజశేఖర్‌ కు ‘గరుడవేగ’ లాంటి కమర్షియల్‌ హిట్‌ అందించి తన టాలెంట్ ఏంటో చూపించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ప్రవీణ్ సత్తారు ఓ రైతు కథను పక్కా పవర్‌ఫుల్‌ యాక్షన్ స్క్రిప్ట్‌ గా రాసుకున్నాడని.. ఓ రైతు తప్పిపోయిన తన కూతురు కోసం వెతికే క్రమంలో అతను చేసే రిస్క్ కి సంబంధించిన సీన్స్ చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయని తెలుస్తోంది.

నాగార్జున ఇమేజ్‌ కి ఈ కథ చాల కొత్తగా ఉంటుందని నాగ్ ఫీల్ అయినట్లు, అందుకే వెంటనే సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. నాగ్ సినిమాల ఎంపిక ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎక్కడ టాలెంట్ ఉన్న పిలిచి మరి అవకాశం ఇస్తారు. కాగా ప్రస్తుతం నాగార్జున అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్‌ డాగ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కొత్తగా ఉండటంతో ఈ సినిమా పై కూడా అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి.

సంబంధిత సమాచారం :

More