పాత్ బ్రేకింగ్ “శివ”కి 35 ఏళ్ళు కానీ అసలు ట్రీట్ ఎప్పుడు?

పాత్ బ్రేకింగ్ “శివ”కి 35 ఏళ్ళు కానీ అసలు ట్రీట్ ఎప్పుడు?

Published on Oct 5, 2024 2:04 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఎన్నో ఐకానిక్ చిత్రాల్లో తన కెరీర్ ఆరంభంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక పాత్ బ్రేకింగ్ మాస్ చిత్రం “శివ” కోసం అందరికీ తెలిసిందే. ఒక ట్రెండ్ లో వెళుతున్న ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన ఈ చిత్రం చాలా మార్పులు తీసుకొచ్చింది. మరి ఈ సినిమా వచ్చి నేటికి 35 ఏళ్ళు పూర్తి చేసుకోగా అభిమానులు సహా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా శివ 35 ఏళ్ల అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందం వక్తం చేస్తున్నాఋ.

సరే ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ట్రీట్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ ఎలా ఉందో తెలిసిందే. అలా రానున్న చిత్రాల్లో శివ రీ రిలీజ్ పై చాలా అంచనాలు సెట్టయ్యాయి. మొన్న “మాస్” రీరిలీజ్ కి రీ మాస్టర్ చేసిన శివ గ్లింప్స్ ఒక ఊహించని ఫీస్ట్ ని ఇచ్చింది. దీనితో ఆ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి వర్మ ఈ అవైటెడ్ డేట్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు