నాగార్జున కూడ ఫైనల్ చేసేశారు

Published on Mar 1, 2021 11:09 pm IST


కింగ్ అక్కినేని నాగర్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇందులో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. హిమాలయాల్లాంటి టఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. మొదటగా సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమేరకు డీల్ కూడ సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పడు ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. సినిమా థియేటర్లు పూర్తిగా తెరుచుకోవడం, 100 శాతం అక్యుపెన్సీకి అనుమతులు దొరకడంతో సినిమాను థియేటర్లలోనే విడుదలచేయాలని నిర్ణయించారు.

మొదట నాగార్జున అభిమానులు కూడ ఓటీటీ అనగానే కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ టీమ్ తీసుకున్న తాజా నిర్ణయంతో వారంతా సంతృప్తి చెందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే హీరో నాగార్జున మాట్లాడుతూ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇది కాకుండా నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :