మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో సముద్రఖని, నయనతార, సునీల్, సత్యదేవ్, తాన్యా రవిచంద్రన్, తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఒక సప్రైజింగ్ పాత్ర లో కనిపించనున్నారు .ఇక ఇటీవల మెగాస్టార్, సల్మాన్ ల మాస్ డ్యాన్సింగ్ నంబర్ థార్ మార్ సాంగ్ రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ నుండి పవర్ఫుల్ గా సాగె నజభజ సాంగ్ లిరికల్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. శ్రీకృష్ణ, పృథ్వి చంద్ర కలిసి అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ కి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో తెలిపే విధంగా సాగె ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


