రేణు దేశాయ్ వెబ్ సిరీస్ పేరు ‘ఆద్య’ ?

Published on Sep 23, 2020 12:36 am IST


ఒకప్పటి నటి రేణు దేశాయ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఛాన్నాళ్లుగా నటిగా కొత్త జర్నీ ప్రారంభించాలని చూస్తున్న రేణు దేశాయ్ వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వచ్చే నెల నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఉండనుంది. కృష్ణ మామిడాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను డీ.ఎస్.రావు, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సత్యాన్వేషణలో ఒక మహిళ ప్రయాణం ఎలా ఉంటుంది అనేదే ఈ వెబ్ సిరీస్ థీమ్ అని రేణు స్వయంగా తెలిపారు. ఇందులో ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓగా కనిపించనున్నారట.

అయితే ఈ వెబ్ సిరీస్ టైటిల్ గా ‘ఆద్య’ అనే పేరును నిర్నయించినట్టు తెలుస్తోంది. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ల కుమార్తె పేరు కూడ ‘ఆద్య’నే కావడంతో ఈ బజ్ అందరకీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ బజ్ ఎంతవరకు నిజం, ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఆద్య అనే పేరే పెట్టడానికి కారణం ఏమిటో చూడాలి. రేణు దేశాయ్ సుమారు 17 ఏళ్ళ తర్వాత మళ్లీ నటించడానికి సిద్దమయ్యారు. చివరగా ఆమె పవన్ కళ్యాణ్ సరసన 2003లో వచ్చిన ‘జానీ’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె దర్శకురాలిగా మారి ఒక సినిమాకు దర్శకత్వం వహించి నిర్మాతగా ఒక సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More