అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు

స్టార్ హీరో అల్లు అర్జున్‌ కు బిగ్ రిలీఫ్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న నాంపల్లి కోర్టు శుక్రవారం రోజున తీర్పును వెలువరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విషయంలో హై కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. అయితే నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో అల్లు అర్జున్ తరఫు లాయర్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ఇప్పటికే విన్న కోర్టు శుక్రవారం అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది.

అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు కావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన ఎవరూ ఊహించనిది అని.. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.

Exit mobile version