ఫోటో మూమెంట్: ఫ్రెండ్స్ తో నమ్ర‌తా & ఫ్యామిలీ వీకెండ్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో త‌రుచూ హాలిడేస్, వెకేష‌న్ కు వెళ్తుంటాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ఫ్యామ‌లీ ఫోటోలు పెడుతుంటాడు. ఆయ‌న భార్య న‌మ్ర‌తా కూడా సోష‌ల్ మీడియాలో త‌రుచూ త‌మ ట్రిప్పులు, వెకేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు పెడుతుంటారు.

తాజాగా న‌మ‌త్రా త‌న ఫ్యామిలీతో పాటు స్నేహితుల‌తో వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఓ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని వీకెండ్స్ చాలా బెస్ట్.. మంచి స‌మ‌యం, గ్రేట్ ఫ్రెండ్స్ ఓ మంచి మెమోరిని ఇస్తారు.. అంటూ ఆమె త‌న ఇన్ట్సాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో న‌మ్ర‌తాతో పాటు మ‌హేష్ బాబు, గౌత‌మ్ కూడా ఉన్నారు.

ఇక ఈ ఫోటోలో మ‌హేష్ లుక్ చాలా కొత్త‌గా ఉంది. హెయిర్ పెంచిన మ‌హేష్, ఓ క్యాప్ పెట్టుకుని క‌ళ్ల‌కు అద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించారు. దీంతో ఈ లుక్ ఆయ‌న నెక్ట్స్ మూవీ కోసమే అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ చిత్రాన్ని రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Exit mobile version