మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకడు. మరి తాను నటించిన చిత్రం “మనమే”తో గత ఏడాది పలకరించాడు. ఇక ఇపుడు మరిన్ని సినిమాలు తాను చేస్తుండగా ఈ సినిమాల్లో తన కెరీర్ 37వ సినిమా కూడా ఒకటి. మరి దర్శకుడు రామ్ అబ్బరాజుతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నందమూరి, కొణిదెల హీరోలు లాంచ్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. ఈ జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఆ నందమూరి,కొణిదెల ప్రముఖులు ఎవరు టైటిల్ ఏంటి అనేవి మున్ముందు తెలియనున్నాయి.
Two Powerhouses, ???????????????????????????????????? & ???????????????????????????????? are coming together for our Charming Star @ImSharwanand ????
Get ready for the grand reveal of #Sharwa37 Title and first look on JAN 14TH ????????
Stay tuned for the excitement ???? @iamsamyuktha_ @sakshivaidya99 @ItsActorNaresh… pic.twitter.com/7XqlWrowEd
— AK Entertainments (@AKentsOfficial) January 8, 2025