నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుంది. ఇక ఇదే సమయంలో బాలయ్య తన 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే, ఇంతలోనే నందమూరి బాలకృష్ణ మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యాక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
తనదైన సినిమాలతో మంచి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకన్న వెంకీ అట్లూరి ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. అయితే, నందమూరి బాలకృష్ణను ఆయన ఓ యాడ్ కోసం డైరెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ యాడ్‌లో బాలకృష్ణ సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడట. ఇక ఆయన సరసన యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ కూడా నటించినట్లుగా తెలుస్తోంది. ఈ యాడ్ కోసం బాలకృష్ణను సరికొత్త మేకోవర్‌లో చూపెట్టాడట ఈ యంగ్ డైరెక్టర్.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక బాలకృష్ణ 109వ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.