మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు – బాలయ్య

మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు – బాలయ్య

Published on Sep 24, 2022 11:59 AM IST

ఇటీవల నందమూరి హీరోలు మరియు నందమూరి అభిమానులు కూడా ఏపీలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఓ నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎన్టీఆర్ యూనివర్సటీ పేరు నుంచి మరో పేరుకు మారుస్తున్న అంశంపై ఆల్రెడీ టాలీవుడ్ ప్రముఖ నటుడు అలాగే టీడీపీ ఎమ్మెల్యే సహా దివంగత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన స్పందనను తెలియజేయడం వైరల్ గా మారింది. తన ఫేస్ బుక్ నుంచి ఒక ఫొటోతో ఈ విధంగా తన మాటలు షేర్ చేసుకున్నారు..

మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..
ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..
శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..

అంటూ బాలయ్య కాస్త తీవ్ర స్థాయిలో తన మాటలు సంధించారు. దీనితో తన లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియా సహా సినీ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు