తెలుగు రాష్ట్రాలలో వరద భీభత్సం సృష్టిస్తోంది. అనేక మంది ఈ వరద ప్రభావంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. సాయం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విపత్కర సమయంలో పలువురు ప్రముఖులు వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు తమవంతు సాయం అందిస్తూ ముందుకు వస్తున్నారు.
తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ తన మంచి మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఉపత్కర సమయంలో తనవంతు బాధ్యతగా ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకి రూ.50 లక్షలు వరద బాధతుల సహాయార్థం అందిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానంటున్న బాలయ్య ప్రకటించాడు.
ఇటీవల నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్ధానం వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇదని.. ఈ ఋణం తీరనిదని ఆయన తెలిపారు.