నందమూరి మోక్షజ్ఞ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఈ సినిమా ప్రారంభం పై నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞ పై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే వాడు స్టార్ అయిపోయి కూర్చున్నాడు. మేము ఎంతో కష్టపడి స్టార్స్ అయ్యాము. కానీ, మోక్షజ్ఞ ఒక్క పిక్చర్ చేయకుండానే స్టార్ అయిపోయాడు. మరో మూడు నెలల్లో తన మొదటి సినిమా మొదలవుతుంది’ అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.
బాలయ్య, మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘తనను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. అది నాకు చాలా ఈజీ. చాలామంది తమ పిల్లల భవిష్యత్తు గురించి చాలా ప్రణాళికలు వేస్తుంటారు. ఎంతో ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఎంతో టెన్షన్ అనుభవిస్తుంటారు. నాకు అదేమీ లేదు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా విషయానికి వస్తే.. ‘ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందని టాక్. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే, ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి ‘దివంగత శ్రీదేవి’ చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.