నా దగ్గర రహస్యాలేమీ ఉండవు – బాలయ్య

నా దగ్గర రహస్యాలేమీ ఉండవు – బాలయ్య

Published on Sep 1, 2024 11:20 PM IST

నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి అప్పుడే 50 ఏళ్ళు పూర్తయ్యాయి. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న బాలకృష్ణ తాజాగా తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన మా నాన్నగారు, నాకు కేవలం తండ్రిగా కాదు, నా గురువు, నా దైవం కూడా. ఆయన కారణ జన్ముడు. ఎన్నో సందర్భాల్లో నాకు ఇన్స్పిరేషన్ ఆయనే.

బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. ‘నేను పుట్టింది చెన్నై. అయినా పెరిగిందంతా హైదరాబాద్ లోనే. నేను చాలా సరదాగా ఉంటాను, అందరిని నవ్విస్తూ ఉంటాను. నేను చాలా జోయల్ గా ఉంటాను. కానీ, మీకున్న ఇమేజ్ యాంగ్రీ మ్యాన్ బాలకృష్ణ అనే ఇమేజ్ ఉంది. ఎందుకు వచ్చింది సార్ ? అని యాంకర్ ప్రశ్నించగా.. ఏమో, నేను చేసే సినిమాలు చూసి అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంటే ఒక ఆరా, అలాగే బాలకృష్ణ అంటే కూడా ఒక ఆరా. నా లైఫ్ తెరిచిన పుస్తకం లాంటిది. నా దగ్గర ఏమి రహస్యాలు ఏమి ఉండవు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు