నందమూరి యువ హీరో చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. బ్రీత్‌కు ముందు ధమ్‌తో పాటు కొన్ని సినిమాల్లో చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలని ప్రయత్నించే ఓ యువకుడి కథతో ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ సోదరుడు అయిన నందమూరి జయకృష్ణ తనయుడే చైతన్య కృష్ణ.
కాగా తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ బసవతారకరామ క్రియేషన్స్ పతాకంపై జయకృష్ణ స్వయంగా బ్రీత్ సినిమాను గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 25న హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో సాయంత్రం 6 గం. ల నుండి గ్రాండ్ గా నిర్వహించనుండగా దీనికి చీఫ్ గెస్టులుగా నందమూరి ఫ్యామిలీ రానున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 2 న ఆడియన్స్ ముందుకి రానుంది.