నందమూరి చైతన్య కృష్ణ “బ్రీత్” కి లేటెస్ట్ రిలీజ్ డేట్.!

నందమూరి చైతన్య కృష్ణ “బ్రీత్” కి లేటెస్ట్ రిలీజ్ డేట్.!

Published on Nov 19, 2023 4:07 PM IST

నందమూరి కుటుంబం నుంచి టాలీవుడ్ పరిచయం అయ్యిన హీరోస్ లో మరో నటుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా ఒకడు. మరి తాను హీరోగా దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “బ్రీత్”. అయితే ఈ చిత్రాన్ని గత కితమే అనౌన్స్ చేసి తెరకెక్కించారు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా ఖర్చుకు వెనకాడకుండా మేకర్స్ నిర్మాణం వహించారు.

మరి ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ లకు కూడా మంచి రెస్పాన్స్ రాగా ఫైనల్ గా అయితే ఇప్పుడు ఈ చిత్రం సరికొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా బసవతారకం క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు