నందమూరి హరికృష్ణ కుమారుడు జానకి రామ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ – విజయవాడ హైవే రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్త నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘అతనొక్కడే’ వంటి విజయవంతమైన సినిమాను నిర్మించారు. సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాకు జానకి రామ్ వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. సౌమ్యుడిగా పేరు సొంతం చేసుకున్న జానకి రామ్ కు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటివలే జానకి రామ్ కుమారుడు ప్రధాన పాత్రలో ‘దాన వీర సూర కర్ణ’ అనే బాలల సినిమా ప్రారంభమైంది.
జానకి రామ్ మృతితో ఆదివారం విడుదల కావాల్సిన ‘పటాస్’ ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది.