‘బింబిసార’ టీజర్… కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం !

Published on Nov 29, 2021 9:32 am IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ చారిత్రక కథాంశంతో రాబోతున్న సినిమా ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లోని విజువల్స్, వాయిస్ ఓవర్ అండ్ యాక్షన్ మరియు ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గాన్ని చూసి తల వంచి బానిసలు అయితే..’ అంటూ సాగిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.

ఇక ‘బింబిసార’ లుక్ లో కళ్యాణ్ రామ్ వైలెంట్ గా కనిపించాడు. ఇది కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం అన్నట్టు ఉంది టీజర్. ‘‘అతను క్రూరమైన వాడు. బార్బేరియన్‌ కింగ్‌ తన భూభాగాన్ని గుర్తించడానికి వస్తున్నాడు’’ అంటూ చిత్ర బృందం ట్వీట్‌ చేసినట్టుగానే టీజర్ లో కళ్యాణ్ రామ్ బాగా ఆకట్టుకున్నాడు, కల్యాణ్‌రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :