‘అమిగోస్’ మిమల్ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయదు – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి కళ్యాణ్ రామ్

Published on Feb 6, 2023 12:10 am IST


ఇటీవల బింబిసార వంటి సోషియో ఫాంటసీ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న మూవీ అమిగోస్. తొలిసారిగా కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ పై నందమూరి అభిమానులతో పాటు అడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి జీబ్రాన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో వైభంగా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అన్నారు. తాతయ్య రామారావు గారు రాముడు భీముడులో అలానే బాబాయి బాలకృష్ణ సింహా సహా మరికొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసారని, ఇక చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్లు, తమ్ముడు తారక్ జైలవకుశ మూవీస్ లో ట్రిపుల్ చేసారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసానని అన్నారు. ఇటీవల బింబిసార తో మంచి విజయం అందించారు. అలానే అమిగోస్ కూడా మీ అందరినీ ఏ మాత్రం డిజప్పాయింట్ చేయదని మాటిస్తున్నాను అన్నారు. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :