ట్రెండింగ్ : మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేట్ చేసిన NBK 107 మూవీ టీమ్

ట్రెండింగ్ : మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేట్ చేసిన NBK 107 మూవీ టీమ్

Published on Sep 6, 2022 8:25 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK 107. ఇంకా టైటిల్ నిర్ణయం కాని ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో ఆయన బర్త్ డే ని NBK 107 మూవీ యూనిట్ నేడు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. మూవీ యూనిట్ తో పాటు కుటుంబసభ్యుల సమక్షంలో మోక్షజ్ఞ కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్న వేడుకల యొక్క ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా త్వరలో మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనుండగా ఆ మూవీ కోసం అటు నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు