ఈ ఉత్సాహాన్ని “దేవర” సరికొత్త స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా – నాని!

ఈ ఉత్సాహాన్ని “దేవర” సరికొత్త స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా – నాని!

Published on Sep 15, 2024 9:30 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇంకా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం తర్వాత రిలీజైన 35 చిన్న కథ కాదు మరియు మత్తు వదలరా 2 చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ విజయాల పై హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సరిపోదా శనివారం తర్వాత 35 మూవీ పై మా ప్రేక్షకులు ప్రేమను కురిపించడం, మరియు ఈ వారం మత్తు వదలరా 2 చిత్రాన్ని పెద్ద విజయం సాధించడం చూసి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ అద్భుతమైన టీమ్‌లకు అభినందనలు. ఈ నెలాఖరున ఈ ఉత్సాహాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని నా ప్రియమైన ఎన్టీఆర్ మరియు కొరటాల శివ గారిని కోరుకుంటున్నాను అని దేవర చిత్రాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు