టాలీవుడ్ నటుడు, నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం విజయ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని బాగా అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. అయితే ఈ విజయ వేడుకలో హీరో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వివేక్ ఆత్రేయ తో తన చిత్రం పై మరియు జోనర్ గురించి వెల్లడించారు. వివేక్ తో అంటే సుందరానికి చిత్రంతో డ్రామా అయిపోయింది, సరిపోదా శనివారం చిత్రంతో యాక్షన్ అయిపోయింది. ఈసారి కామెడీ ఎంటర్టైనర్ చేద్దాం అని నాని అన్నాడు. నాని మరో అవకాశం ఇవ్వడం పట్ల దర్శకుడు వివేక్ ఆత్రేయ సంతోషంతో నాని ను హగ్ చేసుకున్నాడు. నాని మరోసారి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.