సితార ఎంటర్ టైన్మెంట్స్ నేడు మ్యాజిక్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ డిజైన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ పై టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ మ్యాజిక్ ను ఎక్స్ పీరియన్స్ చేసేందుకు ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. నాని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
నాన్న మరియు పొన్నియన్ సెల్వన్ 1 మరియు 2 పాత్రలకు ప్రశంసలు పొందిన సారా అర్జున్ తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీని, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ను, నవీన్ నూలి ఎడిటర్‌గానూ, నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Looking forward to experience the #Magic ♥️ https://t.co/NEDaYtucXP
— Hi Nani (@NameisNani) January 29, 2024