నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ సాలిడ్ వైలెంట్ యాక్షన్ చిత్రం “హిట్ 3”. నాని హీరోగా అలాగే నిర్మాతగా కూడా చేసిన ఈ చిత్రం ఇపుడు సాలిడ్ బజ్ ని తెచ్చుకుంది. లేటెస్ట్ గా వదిలిన ట్రైలర్ తో అంచనాలు కూడా మరింత అయ్యాయి.
ఇక ఈ చిత్రం విషయంలో నాని ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది ఇపుడు తెలుస్తుంది. తన నిర్మాణంలో రీసెంట్ గా వచ్చిన చిత్రం ‘కోర్ట్’ ప్రమోషన్స్ లో తాను చెప్పిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. కోర్ట్ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 సినిమా ఎవరూ చూడొద్దని ఎంతో నమ్మకంగా తాను తెలిపాడు.
కట్ చేస్తే కోర్ట్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇపుడు హిట్ 3 విషయంలో కూడా ఇదే తరహా నమ్మకాన్ని తాను వ్యక్తం చేస్తున్నాడు. హిట్ 3 సినిమా కానీ ఆడియెన్స్ కి ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వకపోతే ఇక తర్వాత నుంచి తన సినిమాలు చూడొద్దు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ తాను ఇచ్చాడు. దీనితో నాని హిట్ 3 విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.