న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్‌నైట్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా నానితో స్టార్ట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.
చిరు-ఓదెల ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను నాని తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ క్రమంలో నాని ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో చిరు-ఓదెల ప్రాజెక్ట్‌పై ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
చిరంజీవితో శ్రీకాంత్ చేయబోయే ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరంలో రానుందని ఆయన వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై మరోసారి ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.