ప్రామిసింగ్ టీజర్ తో “హాయ్ నాన్న” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.!

ప్రామిసింగ్ టీజర్ తో “హాయ్ నాన్న” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Oct 15, 2023 11:20 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “హాయ్ నాన్న”. మరి ఇది నాని కెరీర్ లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తుండగా మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాపై టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ అయితే క్లీన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉందని చెప్పాలి.

తన కూతురుకి తనకి ఉండే ఎమోషనల్ బాండ్ వారి మధ్య ఫన్ ని శౌర్యువ్ బాగా చూపించాడు. అలాగే నాని కూడా సూపర్ కూల్ లుక్స్ లో కనిపించి అదరగొట్టాడు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో నాని కెమిస్ట్రీ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. అలానే ఈ ఇద్దరి లవ్ ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

మరి మొత్తానికి అయితే ఈ టీజర్ మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఇక దీనితో అయితే మేకర్స్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు, మొదట డిసెంబర్ 22కి లాక్ చేసిన ఈ చిత్రాన్ని అనుకున్నట్టుగానే డిసెంబర్ 7 కి ప్రీపోన్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేసారు. సో ఆ రోజున ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు