మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. మరి నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నాని ఇపుడు సెపరేట్ మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. ఇది ఇంకా పెరుగుతూనే వెళుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇలా ప్రస్తుతం నాని చేస్తున్న లేటెస్ట్ సినిమాలు రెండిటికి కూడా భారీ ఓటిటి డీల్ వచ్చినట్టుగా టాక్ ఉంది.
ఇలా ప్యారడైజ్ కి ఏకంగా 60 కోట్లకి పైగా ప్రముఖ ఓటిటి సంస్థ నుంచి డీల్ వస్తే ఇపుడు హిట్ 3 కి కూడా సాలిడ్ ఆఫర్ వచ్చినట్టుగా రూమర్స్ వస్తున్నాయి. దీనితో హిట్ 3 కి 55 కోట్ల మేర ఓటిటి డీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో నాని క్రేజ్ ఓటిటి పరంగా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా ఈ మే 1న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.