నాని “హిట్ 3” కి సర్వం సిద్ధం!?

నాని “హిట్ 3” కి సర్వం సిద్ధం!?

Published on Aug 31, 2024 2:07 AM IST


నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో రెండు హిట్ చిత్రాలను అందించిన నాని, తాజాగా సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పుడు మరొక చిత్రంతో ఆడియెన్స్ ను స్టన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ మరియు హిట్ 2 చిత్రాలు మంచి సక్సెస్ ను సాధించాయి. హిట్ 3 కూడా కన్ఫర్మ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాని హీరోగా నటించబోయే ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు