న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో SJ సూర్య పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో నాని విలేకరుల సమావేశంలో ‘సరిపోదా శనివారం’ విశేషాలని పంచుకున్నారు.
‘సరిపోదా శనివారం’లో మీకు ఎక్సయిట్ చేసిన పాయింట్ ఏమిటి?
ట్రైలర్‌లో ఏదైతే చూపించామో అది నాకు బాగా ఎక్సయిట్ చేసింది. దాని నెరేటివ్ ఎలా ఉంటుందనే మీరు సినిమాలో చూడాలి. ఐడియాని ట్రైలర్‌లో చెప్పాం. ఆ ఐడియాని ఎలా ఎగ్జిక్యూటివ్ చేశామనేది తెలియాలంటే సినిమా చూడాలి.
‘సరిపోదా శనివారం’లో మీకు ఛాలెజింగ్‌గా అనిపించిన పార్ట్ ఏమిటి?
ఛాలెజింగ్ అంటూ ఏమీ లేదు. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. జనరల్‌గా నా సినిమాలన్నిటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్‌జే సూర్య గారి మీద, వివేక్ మీద ఉంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్‌జే సూర్య, ప్రియాంక, మురళీశర్మ.. ఇలా అందరిపై భారం ఉంది.
ఎస్‌జే సూర్య గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఎస్‌జే సూర్య గారితో కలసి పెర్ఫార్మ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయనకి చాలా అండర్‌స్టాడింగ్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌లో ఆయన నుంచి ఒక కొత్త పెర్స్పెక్టివ్‌ని నేర్చుకోవచ్చు. ఆ రోల్‌కి ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్ దాదాపు ఏడు రోజులు చెప్పారు. అద్భుతంగా వచ్చింది. తన డబ్బింగ్ కోసం మరో రెండుసార్లు సినిమా చూస్తారు. ‘సరిపోదా శనివారం’ చాలా మంచి కథ. అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ ఉంటాయి. కథ ప్రకారం ఆ అడ్రినలిన్ పంపింగ్ వందశాతానికి తీసుకెళ్ళాం. సినిమా చాలా ఆర్గానిక్ గా కుదిరింది. థియేటర్స్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి?
‘సరిపోదా శనివారం’ చాలా రేసీ ఫిలిం. నెరేటివ్ కూడా రేసీగా ఉంటుంది. సినిమా పరిగెడుతుంటుంది. ఇలాంటి పరిగెడుతున్న సినిమాకి ఏం స్కోర్ చేస్తాడనే ఒక క్యురియాసిటీ ఉండేది. నిన్న వెళ్లి ఆర్ఆర్ చూశా. బేసిగ్గా సినిమాల్లో హీరోకి ఇంట్రో సాంగ్ ఉంటుంది. తర్వాత మేలోడీలు, ఎమోషనల్ సాంగ్స్ వస్తాయి. అందులో బిట్స్‌ని ఆర్ఆర్‌గా పంప్ చేస్తుంటారు. కానీ జేక్స్.. మొత్తం సినిమాని హీరో ఇంట్రో సాంగ్ లా కొట్టాడు. తన మ్యాజిక్ 29న చూస్తారు.
‘అంటే సుందరానికీ’ విడుదల తర్వాత మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారని వివేక్ చెప్పారు?
‘అంటే సుందరానికీ’ చాలా మందికి ఫేవరేట్ సినిమా. ఆ జోనర్‌ని ఇష్టపడే ఆడియన్స్‌కి అది అల్ టైం ఫేవరేట్‌లో ఒకటి. అయితే రిలీజైన రోజుల్లో ఆ సినిమా రన్ టైం, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అలాంటి సమయంలో ‘నేను సరిగ్గానే చేశానా?’ అనే డౌట్స్ తనలో ఉండేవి. భాద్యత తీసుకున్న వారికి ఇలాంటి డౌట్స్ ఉండటం సహజం. అలాంటి సమయంలో తన బలాన్ని గుర్తు చేస్తూ నేను తన పక్కన ఒక బ్రదర్‌లా ఉన్నాను. తను టెర్రిఫిక్ డైరెక్టర్. ‘సరిపోదా శనివారం’కి రన్ టైం, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్. మేము అనుకున్న ఐడియా, సెటప్,పే అఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. మేము ఎలా చేయాలని అనుకున్నామో అలా చేశాం.
సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని నిర్మాత దానయ్య గారు చెప్పారు?
నా ప్రతి సినిమాకి ఇలానే చేస్తానండి. నా డైరెక్టర్‌కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌లా పని చేస్తాను. నా నిర్మాతలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సినిమా రిలీజైన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిస్తేనే సక్సెస్ అని ఫీలౌతాను.
ఈ సినిమాకి శనివారమే పెట్టడానికి కారణం ఏమిటి?
అదిరిపోయే ఎమోషనల్ రీజన్ ఉంది. నా ఫేవరేట్ మూమెంట్ అది. సినిమా స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాలకి వస్తుంది.
సోకులపాలెం ఇందులో కీ ఎలిలెంట్‌గా ఉంటుదని విన్నాం?
ఈ కథలో సోకులపాలెం ఒక ఎంటిటి. బ్యాక్‌గ్రౌండ్ అండర్ లైన్ ఎమోషన్. సూర్య, దయ, చారులత పాత్రల మధ్య జరిగే కథ, ఆ కథకు ఎమోషన్‌ని యాడ్ చేసేది సోకులపాలెం.
‘సరిపోదా శనివారం’ ని ప్రాంచైజ్‌గా తీసుకువెళ్ళాలనే ఆలోచన ఉందా?
పాజిబులిటీ అయితే ఉంది. ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేస్తే పాజిబులిటీ ఉంటుంది.
ఇందులో యాక్షన్ పార్ట్ ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
ఇందులో 20 పర్సెంట్ యాక్షన్, 80 పర్సెంట్ యాక్షన్ మూడ్ ఉంటుంది. ఇందులో యాక్షన్ మూడ్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
‘సరిపోదా శనివారం’ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది?
‘సరిపోదా శనివారం’ స్క్రీన్ ప్లే, నెరేటివ్ చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది.
‘దసరా’ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా మీ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా.. అప్పటికి ఇప్పటికి రెస్పాన్స్ ఎలా ఉంది?
నిజంగా అంత ప్రేమని నేను ఊహించలేదు. వేరే రాష్ట్రాలలో ఈవెంట్ కి వస్తున్న జనాలని చూస్తుంటే ఇలా ఎలా వస్తున్నారని సర్‌ప్రైజింగ్ గా అనిపిస్తుంది. సినిమా సినిమాకి చాలా ఆదరణ పెరుగుతోంది. ఇది భాద్యతని మరింత పెంచుతోంది.
మీ జర్నీలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్?
పర్సనల్ లైఫ్ లో అయితే జున్ను బర్త్ డే. సినిమాల విషయానికి వస్తే మారుతూ ఉంటుంది. ‘దసరా’ సినిమాని సుదర్శన్‌లో చూసినప్పుడు చాలా మెమరబుల్ గా అనిపించింది. ఈ సినిమాతో మరో ఫ్రెష్ మెమరీ రాబోతోంది.