హార్రర్ సినిమా చేయను అని క్లారిటీ ఇచ్చిన నాని!

హార్రర్ సినిమా చేయను అని క్లారిటీ ఇచ్చిన నాని!

Published on Aug 21, 2024 6:00 PM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29 వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు తెలుగు మీడియా తో ఇంటరాక్ట్ అయ్యాడు హీరో నాని. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అయితే ఒక విలేఖరి, హార్రర్ జోనర్ లో చిత్రం గురించి అడగగా, నాని క్లారిటీ ఇచ్చాడు. హార్రర్ జోనర్ లో సినిమా చేయను అని, గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చాడు. నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎస్. జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు