Court: నాని ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా డ్యూటీ చేస్తాయ్..

నాచురల్ స్టార్ నాని మన తెలుగు సినిమా దగ్గర ఒక నిలకడ ఉన్న హీరో అని చెప్పాలి. వరుస హిట్స్ తో తను హీరోగా నటించిన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలు అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీ లలో కూడా అందించడం విశేషం అయితే తాను నటించిన సినిమాలే కాదు నిర్మించిన సినిమాలు కూడా డ్యూటీ చేస్తాయి అని ఇపుడు మరోసారి ప్రూవ్ అయ్యింది. నాని హీరోగా చేసిన సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో మినిమం గ్యారెంటీ ఉంది.

తెలుగు స్టేట్స్ లో అంతంత మాత్రమే రాణించిన అంటే సుందరానికీ సినిమా యూఎస్ లో 1 మిలియన్ దాటింది. ఇక ఇపుడు తన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ డాలర్లు మార్క్ క్రాస్ చేసి అదరగొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు తమ హీరో నాని పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఒక్క నాని నటించిన సినిమాలే కాదు.. తను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా యూఎస్ మార్కెట్ లో డ్యూటీ చేస్తున్నాయ్ అని చెప్పవచ్చు.

Exit mobile version