పాటల సమీక్ష : ‘జెర్సీ’ – సందర్భోచితంగా సాగే ఆల్బమ్ !

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘జెర్సీ’. కాగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ లో జెర్సీ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. పాట : అదేంటోగాని

‘అదేంటోగాని ఉన్నపాటుగా’ పాటతోనే ఈ ఆల్బమ్ మొదలవుతుంది. రొమాంటిక్ ఫీలింగ్స్ తో సాగే ఈ పాట సినిమాలో హీరో హీరోయిన్లకు ఓదార్పునిచ్చే విధంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. పాట విన్న వెంటనే ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ తాలూకు భావాలను హైలెట్ అయ్యే విధంగా అనిరుధ్ సాంగ్ ను చక్కగా కంపోజ్ చేశారు.
 
2. పాట :స్పిరిట్ ఆఫ్ జెర్సీ

ఈ పాటను కాలా భైరవ పాడారు. ఈ స్పిరిట్ ఆఫ్ జెర్సీ పాటను కృష్ణకాంత్ రాశారు. మొత్తానికి పాట విన్న వెంటనే స్పూర్తిదాయకంగా అనిపిస్తోంది. ఇక సినిమాలో ఈ పాట నాని తిరిగి గెలచే క్రమంలో నేపధ్య గీతంలా వచ్చేలా ఉంది. కృష్ణ కాంత్ ఈ పాటను తన శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది.

3. పాట : పదే పదే
 
ఈ పదే పదే పాట ఆల్బమ్ లో మూడో పాటగా వస్తుంది. ఇక పాట గురించి చెప్పాలంటే.. పాటలోని సాహిత్యం ఆకట్టుకుంటుంది. పాట విన్నాక మంచి అనుభూతి కలిగిన భావన కలుగుతుంది. ఈ పాట గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఒక సందర్భోచిత గీతం. అనిరుద్ శ్రావ్యమైన సంగీతాన్ని అందించి పాటను చక్కగా తీర్చిదిద్దారు.
4. పాట : ప్రపంచమే అలా
 
రచయిత కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాట కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రతిభావంతులైన షాషా తిరుపతి మరియు గంగ ఆకట్టుకునే వాయిస్ తో ఈ పాటను చక్కగా పాడారు. ఇక మరోసారి అనిరుద్ అందించిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ముఖ్యంగా వీణ బిట్ ఆకట్టుకుంటుంది.

5. పాట : నీడ పడదని
 
ఈ సాంగ్ ఈ ఆల్బమ్ లో చివర పాటగా వస్తోంది. రచయిత కృష్ణ కాంత్ ఈ పాటను లోతైన పదాలతో చాలా చక్కని వ్రాయటం జరిగింది. సింగర్స్ అద్భుతమైన గానంతో ఈ పాటను పాడారు. అనిరుద్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది.
తీర్పు:
మొత్తంగా, జెర్సీ సంగీతం బాగానే ఆకట్టుకుంటుంది. ఈ ఆల్బమ్ ఎక్కువగా భావోద్వేగంగా సాగింది. అయితే అన్ని రకాల పాటలు మరియు సందర్భోచితంగా వచ్చే పాటలతో జెర్సీ ఆల్బమ్ ఉంది. మెయిన్ గా సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు పాటలను మరింతగా ఎక్కువుగా ఇష్టపడతారు. మొత్తం మీద ఈ పాటలు సినిమాను ప్రేక్షకులకు ఇంకా బలంగా దగ్గర చేయడంలో బాగా దోహపడతాయి.

Click here for English Music Review

 

Exit mobile version