సక్సెస్ మీట్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని!

సక్సెస్ మీట్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని!

Published on Sep 6, 2024 8:32 PM IST


సరిపోదా శనివారం చిత్రంతో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నాడు హీరో నాని. ఈ చిత్రం ప్రమోషన్స్ ను గట్టిగానే చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, మిగతా భాషల్లో కూడా మంచి ప్రమోషన్స్ చేసిన నానికి కేరళ ఫ్యాన్స్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. ప్రమోషన్స్ టైమ్ లో ఇచ్చిన ఆ గిఫ్ట్ ను సక్సెస్ మీట్ లో వేసుకుంటా అని మాట ఇచ్చాడు. అయితే సక్సెస్ మీట్ లో కూడా అదే షర్ట్ ను ధరించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

సినిమా ఎలా ఆడుతుంది అనే దానికంటే కూడా, షర్ట్ ను ధరిస్తే చాలా వరకు రిలీఫ్ ఫీల్ అయినట్లు పేర్కొన్నాడు. అయితే ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్ షర్ట్ కి సంబందించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని ఈ చిత్రం సక్సెస్ తో మరికొన్ని చిత్రాలను స్టార్ట్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు