“మా నాన్న సూపర్ హీరో” టీజర్ ను రిలీజ్ చేసిన నాని!

సుధీర్ బాబు హీరోగా, దర్శకుడు అభిలాష్ కంకర (లూజర్ సిరీస్ ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో చిత్రం అక్టోబర్ 11, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను నాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
ఇది ఒక ఆనందకరమైన ఆశ్చర్యం. నేను ఇప్పటికే సుధీర్ బాబు కోసం వేచి ఉన్నాను. మనం ఒక అందమైన ప్రయాణంలో ఉన్నామని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇదిగో మా నాన్న సూపర్ హీరో టీజర్ అంటూ చెప్పుకొచ్చారు. టీజర్ ఆద్యంతం ఎమోషనల్ కంటెంట్ తో నిండి ఉంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ జర్నీ ను ఈ చిత్రంలో చూపించనున్నారు. టీజర్ లో సుధీర్ బాబు తో పాటుగా, సాయి చండ్, షాయాజీ షిండే లు కనిపించారు. వీరి పెర్ఫార్మెన్స్ బాగుంది. జయ్ క్రిష్ ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను టీజర్ కు అందించారు.
టీజర్ ను హైలైట్ చేయడం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Exit mobile version