అయితే ఏంటి.. అంటూ కొత్త మూవీ అప్డేట్ పట్టుకొస్తున్న నాని

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని, ప్రేక్షకులు మరో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

నాని తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చేయడానికి రెడీ అయ్యాడు. నాని కెరీర్‌లో 32వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 5న ఉదయం 11.04 గంటలకు చేయబోతున్నట్లు నాని వెల్లడించాడు. ఈమేరకు ఓ పోస్టర్‌ను కూడా ఆయన రిలీజ్ చేశాడు. రక్తం మరక ఉన్న చేతితో కారు స్టీరింగ్‌ను పట్టుకుని ఉన్న ఈ పోస్టర్ ఈ మూవీపై ఆసక్తిని రేపుతోంది. దీనికి డైలాగ్ క్యాప్షన్‌గా హిందీలో ‘‘హా..తో..?’’ అని పోస్టర్‌పై ఉంది.

దీంతో ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఇది ‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో రాబోయే సినిమా అని.. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి నాని కెరీర్‌లో తెరకెక్కనున్న 32వ ప్రాజెక్ట్ నిజంగానే ‘హిట్-3’ చిత్రమా లేక వేరొక సినిమానా అనేది సెప్టెంబర్ 5న తేలిపోనుంది.

Exit mobile version