నాని నెక్ట్స్ మూవీ అదేనా..?

నాని నెక్ట్స్ మూవీ అదేనా..?

Published on Jun 21, 2024 10:01 PM IST

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స‌రిపోదా శ‌నివారం’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్, సాంగ్ రిలీజ్ కావ‌డంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఈ సినిమా త‌రువాత నాని తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవ‌రితో చేస్తాడా అనే ఆస‌క్తి ప్రస్తుతం అంద‌రిలో నెల‌కొంది. ‘బ‌లగం’ వేణు తో నాని చేయాల్సిన సినిమా వాయిదా ప‌డింది. అటు యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల‌ తో నాని ఓ సినిమా చేయాల్సి ఉండ‌గా, దాన్ని కూడా ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా వార్తలు వ‌స్తున్నాయి. అయితే, నాని ‘హిట్’ చిత్రాల ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌నుతో క‌లిసి ‘హిట్-3’ సినిమాను స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే శైలేష్ కొల‌ను ‘హిట్-3’ స్క్రిప్టును రెడీ చేసి నానికి వినిపించాడ‌ట‌. ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమా రిలీజ్ కాగానే ‘హిట్-3’ చిత్రాన్ని మొద‌లుపెట్టాల‌ని నాని చూస్తున్న‌ట్లుగా సినీ స‌ర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు