ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లాంటి మార్కెట్ లో కూడా నిలకడగా మార్కెట్ ని కొనసాగిస్తున్న అది కూడా టాప్ అండ్ మిడ్ రేంజ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మరి నాని సినిమాలకి యూఎస్ మార్కెట్ లో మినిమమ్ గ్యారెంటీ మార్క్ ఉంది. ఇప్పుడు ఇలానే యూఎస్ మార్కెట్ లో మరోసారి తన ర్యాంపేజ్ ని నాని చూపిస్తున్నాడు. తన లేటెస్ట్ చిత్రం “సరిపోదా శనివారం” తో నార్త్ అమెరికా సైడ్ అదరగొడుతున్నాడు.
సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉంది అనగా ఏకంగా 3 లక్షల డాలర్స్ మార్క్ ని నాని దాటించేసాడు. దీనితో ప్రీమియర్స్ సహా అక్కడ డే 1 కి టైర్ 2 హీరోస్ లో భారీ ఓపెనింగ్స్ ని నాని సెట్ చేయనున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా నటించారు. అలాగే జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రంని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించగా రేపు ఆగస్ట్ 29న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
#SaripodhaaSanivaaram storms ahead with over $300K+ in USA Premiere pre-sales! And the numbers keep firing up????#PotharuMothamPotharu ????????????????
Book Your Tickets Now : https://t.co/Sf8ECKDz2c
Natural ???? @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@DVVMovies… pic.twitter.com/5h1TTscm19
— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 28, 2024