న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ వచ్చే వారం రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రయే డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో పలు భాషల్లోనూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ టైటిల్ పెట్టినా, నాని మాత్రం సరిపోతుంది గురువారం అంటున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 29న గురువారం రోజున రిలీజ్ చేస్తున్నారు. అయితే, తన గత సినిమాలు కూడా గురువారం రోజునే రిలీజ్ అయ్యాయని నాని గుర్తుకు చేశాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలు గురువారం రోజున రిలీజ్ అయ్యి, మంచి విజయాన్ని అందుకున్నాయి.
దీంతో ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని కూడా గురువారం రిలీజ్ చేయడంతో ఆయన సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో పలు క్రేజీ చిత్రాలను కూడా గురువారం రోజున రిలీజ్ చేసేందుకు ఆయా చిత్రాల మేకర్స్ సిద్ధమవుతున్నారు.