సరిపోదా శనివారం.. ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిత్రం. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
నాని మాస్ అవతార్‌లో చేసిన శివతాండవం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. నాని విధ్వంసకర పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమాకు కళ్లు చెదిరే వసూళ్లు వస్తున్నాయి.
ఇక నాని గత రెండు చిత్రాలు కూడా రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో ఇప్పుడు ‘సరిపోయిందా శనివారం’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. యు‘నాని’మస్‌గా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతోనే ఈ రికార్డు సొంతం అయిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.