యూఎస్ మార్కెట్ లో “సరిపోదా శనివారం” తాండవం

నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నాని కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి తన మాస్ సినిమా పవర్ చూపించింది. ఇక ఈ చిత్రం 100 కోట్లకి పైగా వసూళ్లు వరల్డ్ వైడ్ అందుకోగా యూఎస్ మార్కెట్ లో అయితే నాని కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు అందుకున్న చిత్రంగా “దసరా” ని క్రాస్ చేసి దుమ్ము లేపింది.

అయితే ఈ చిత్రం ఇప్పటికీ యూఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా రన్ అవుతూ అదరగొట్టడం విశేషం. లేటెస్ట్ గా సరిపోదా శనివారం చిత్రం యూఎస్ మార్కెట్ లో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ గ్రాస్ ని అందుకొని సెన్సేషనల్ మైల్ స్టోన్ ని అందుకుంది. దీనితో ఇన్ని రోజులు అయినా కూడా సరిపోదా శనివారం తాండవం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version