న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో నాని పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు.
ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాకు రెండు రోజుల్లో నార్త్ అమెరికాలో ఏకంగా 319K డాలర్లుకు పైగా వసూళ్లు దక్కినట్లు ఓవర్సీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘సరిపోదా శనివారం’ సినిమాలో నాని సరసన అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటించాడు. జేక్స్ బిజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.