నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మాస్ ఫ్యామిలీ డ్రామా “సరిపోదా శనివారం” కోసం తెలిసిందే. తమ కాంబినేషన్ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది కాగా దీనిపై మంచి అంచనాలు మొదటి నుంచీ నెలకొన్నాయి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సాలిడ్ వసూళ్లతో అదరగొడుతుంది.
ఇలా యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం తాండవం ఆడేస్తుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా ఈ చిత్రం అక్కడ 7 లక్షల 50 వేలకి పైగా డాలర్లు గ్రాస్ ని అందుకుంది. దీనితో నాని కెరీర్ లో మరో 1మిలియన్ డాలర్ సినిమా పడబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
#SaripodhaaSanivaaram hits the $750K+ mark in North America, and there’s no stopping now! ????#uNANiMassBlockbuster ????@NameisNani @DVVMovies @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/MTmyyqt9gX
— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 29, 2024