నాని – శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!?

నాని – శ్రీకాంత్ ఓదెల సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!?

Published on Jul 21, 2024 10:57 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. వీరి కాంబినేషన్ లో మరో చిత్రం రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను దాదాపు 100 కోట్ల రూపాయలకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రంను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఆగస్ట్ 29 న థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు