నాని-ఓదెల కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

టాలీవుడ్‌లో ‘దసరా’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ‘దసరా’ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వీరి కాంబో ఫిక్స్ అవగా, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో రానున్న రెండో సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు కూడా భారీగా క్రియేట్ అవుతున్నాయి. అయితే, ఈ సినిమాను దసరా పండుగ రోజైన అక్టోబర్ 12న గ్రాండ్ లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను కూడా శ్రీకాంత్ ఓదెల తనదైన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాని పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుంది. ఈ మూవీ లాంచ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version