న్యాచురల్ స్టార్ నాని రీసెంట్గా ‘సరిపోదా శనివారం’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు ‘హిట్-3’ చిత్ర షూటింగ్లో బిజీ అయిన నాని, తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని కూడా లాంచ్ చేశాడు. గతంలో నానితో ‘దసరా’వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి నాని చేతులు కలిపాడు.
వీరిద్దరి కాంబినేషన్లో రెండో సినిమా రానుందనే వార్త గతకొంత కాలంగా జోరుగా వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ వీరు తమ కాంబినేషన్లోని రెండో సినిమాను దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని లాంచ్ చేశారు. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని నేడు ప్రారంభించారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నాని మరోసారి ఊరమాస్ అవతారంలో కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.