నాని జెర్సీ కి అరుదైన గౌరవం.

Published on Aug 1, 2020 3:03 am IST


గత ఏడాది నాని నటించిన జెర్సీ మూవీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. జెర్సీ ఇంటెర్నేషన్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది. ఆగస్టు 9 నుండి 15వరకు జరగనున్న ఈ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ లో జెర్సీ మూవీ ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ లో మూవీ ప్రదర్శించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా ఫిల్మ్ మేకర్స్ భావిస్తారు. జెర్సీ మూవీతో ఆ ఫీట్ అందుకున్న నాని రికార్డు నెలకొల్పారు.

యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ చిత్రాన్ని ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఏజ్ బార్ క్రికెటర్ పాత్రలో నాని అధ్బుత నటన కనబరిచారు. ఇక హీరోయిన్ శరద్దా శ్రీనాధ్ మరియు సత్య రాజ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More