పిక్ టాక్: జిమ్‌లో చెమటోడుస్తున్న నాని

పిక్ టాక్: జిమ్‌లో చెమటోడుస్తున్న నాని

Published on Feb 2, 2025 12:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని నటించే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ప్రకటించి, ఓ సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ అయిన ‘హిట్-3’ షూటింగ్‌లో నాని బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపిస్తాడు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర నాని సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా, ఇందులో నాని పాత్ర చాలా విధ్వంసకరంగా ఉండబోతుందని తెలుస్తోంది.

అయితే, ఈ రెండు సినిమాల కోసం నాని ప్రస్తుతం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇటు ‘హిట్-3’లో పోలీస్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం.. అటు ‘ది ప్యారడైజ్’ మూవీలోని తన పాత్ర కోసం నాని బాడీ పెంచుతున్నాడు. జిమ్‌లో ఆయన చెమటోడుస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు