‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ కోసం నాని

‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ కోసం నాని

Published on Sep 11, 2024 10:14 PM IST

నవదళపతి సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న సుధీర్ బాబు, ఈ సినిమాతో ఇప్పుడు మరోసారి తన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ చిత్ర టీజర్‌ను సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ టీజర్‌ను న్యాచురల్ స్టార్ నాని చేతులమీదుగా లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. సెప్టెంబర్ 12న సాయంత్రం 5.49 గంటలకు ఈ టీజర్‌ను డిజిటల్‌గా నాని లాంచ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్నా హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి చంద్, షాయాజి షిండే, రాజు సుందరం, శశాంక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు